బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Homeతెలంగాణ

ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి రైతులకు కొత్త పంట రుణాలు మంజూరు చేయాలి.. పాత రుణాల కోసం బ్యాంకులు ఒత్తిడి చేయవద్దు

ఘనంగా కామ్రేడ్ యామిని పుల్లయ్య 4వ వర్ధంతి
హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శక్తి జ్యువలర్స్ సౌజన్యంతో షాపూర్ నగర్ డివిజన్ సంజయ్ గాంధీ నగర్లో కుత్బుల్లాపూర్ మండలం,
జాతీయ సేవా పథకం (NSS) దినోత్సవం ప్రత్యేకం

ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
రైతులకు కొత్త పంట రుణాలు మంజూరు చేయాలి.. పాత రుణాల కోసం బ్యాంకులు ఒత్తిడి చేయవద్దు

సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

నమస్తే భారత్ :-మరిపెడ

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ ప్రభుత్వాన్ని కోరారు.మరిపెడ బంగ్లా మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన సిపిఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.మండలంలోని అనేక గ్రామాల్లో సరిపడా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి, మిర్చి, పత్తి పంటలు కొంతమేర.ఎండిపోతున్నాయని, పంటలు సాగు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు విద్యుత్‌ అంతరాయాలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. ఇప్పటికే పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్యాంకులు పాత రుణాల చెల్లింపుల కోసం రైతులపై ఒత్తిడి చేయకుండా సహకరించాలని అబ్దుల్ రషీద్ కోరారు. రైతులకు కొత్త పంట రుణాలు మంజూరు చేసి, తిరిగి వ్యవసాయం చేసుకునేందుకు ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించి, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సమావేశంలో సిపిఐ మరిపెడ బంగ్లా పట్టణ కార్యదర్శి అంజి, సహాయ కార్యదర్శి వీరేందర్, వెంకన్న, వీరన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: