బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Homeతెలంగాణ

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న స్విమ్మర్ రాజు
అంగన్వాడీ పోస్టుల భర్తీపై స్పష్టతనిచ్చిన మరిపెడ ప్రాజెక్టు ఐసిడిఎస్. సీడీపీఓ ఎం. ఎల్లమ్మ
3వ వార్డులో పారిశుధ్య పనులపై డీసీసీ వీసారపు శ్రీపాల్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి పరిశీలన

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్ ) బతుకమ్మ సంబరాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమం హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఆరోగ్య కేంద్ర ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో, తీరొక్క బతుకమ్మలతో అందంగా అలంకరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని కొనియాడారు. ప్రజల ఆరోగ్య రక్షణలో నిరంతరం శ్రమించే సిబ్బంది అంతా కలిసికట్టుగా ఇలాంటి సంప్రదాయ పండుగలను జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో మహిళా సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లతో, లయబద్ధమైన పాటలతో సందడి చేశారు.
పాల్గొన్న సిబ్బంది:
ఈ వేడుకల్లో పబ్లిక్ హెల్త్ నర్స్ (పీహెన్ ) మంగమ్మ, సూపర్‌వైజర్లు ఆచార్యులు, లక్ష్మి కుమారి, మాధవి, సీనియర్ అసిస్టెంట్ కుమార్ పాల్గొన్నారు. అలాగే పల్లె దవాఖాన సిబ్బంది అఖిల, ఝాన్సీ, అనిత, ఉపేంద్రలతో పాటు నర్సింగ్ ఆఫీసర్లు, ANMలు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర ఆరోగ్య కేంద్ర సిబ్బంది అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: