బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ.

Homeతెలంగాణ

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ.

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల

మెదక్ జిల్లా కలెక్టర్ ను కలిసిన రెడ్ క్రాస్ ప్రతినిధులు
తొర్రూరులో భక్తి పారవశ్యంలో శ్రీ మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి జంతర్ మంతర్ ధర్నాకు మద్దతుగా కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని సీపీఐ నిరసన

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ.

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, వేటా (WETA) అధ్యక్షురాలు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు.తొర్రురు మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు వేటా (ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ తెలుగు.అసోసియేషన్)–ఇండియా అనుసంధానం చేసుకొని శనివారం తొర్రూరు పెద్ద చెరువు సమీపంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళల కోలాహలంతో తొర్రూరు పెద్ద చెరువు పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం మహిళల్లో ఐక్యతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని భావితరాలకు అందిస్తుందని తెలిపారు.
మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొంటూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో బతుకమ్మ వంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, పట్టణ వార్డు కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దసాని సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, కౌన్సిలర్లు సీనియర్ నాయకులు చాపల బాపురెడ్డి, పెదగాని కళావతి సోమయ్య, బసనబోయిన ఐలమ్మ, జాటోత్ భద్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: