సేవా స్ఫూర్తితో ముందుకు.మేరా యువ భారత్ వాలంటీర్‌గా సందీప నమస్తే భారత్ :-పాలకుర్తి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘మేరా య
సేవా స్ఫూర్తితో ముందుకు.మేరా యువ భారత్ వాలంటీర్‌గా సందీప
నమస్తే భారత్ :-పాలకుర్తి
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘మేరా యువ భారత్’ (మై భారత్ ) సంస్థ జాతీయ యువజన దళం (NYC) పథకం కింద పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన యువకుడు ఎలమకంటి సందీప్ పాలకుర్త్ మరియు దేవరుప్పుల బ్లాక్ వాలంటీర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు వరంగల్ జిల్లా యువజన అధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.దేశ నిర్మాణంలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని, ‘వికసిత్ భారత్’ సాధనకు కృషి చేస్తానని సందీప్ తెలిపారు. యువతీ యువకులు మై భారత్ పోర్టల్‌లో సభ్యులుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, తన ఎంపికకు సహకరించిన జిల్లా యువజన అధికారి సంజీవ్, అకౌంటెంట్ దేవీలాల్, డీజీ నామినీస్ రజిత, నాగార్జునలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మై భారత్ యువ వాలంటీర్‌గా ఎంపికైన ఎలమకంటి సందీప్‌ను గ్రామస్తులు, యువత మరియు పలువురు అభినందించారు.

COMMENTS