బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న

Homeతెలంగాణ

వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న

వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో వినాయక చవి

ఆడబిడ్డలే అండగా… సమ్మన్నకు జనహృదయాల్లో ప్రత్యేక స్థానం!
మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు
షాద్‌ నగర్‌ – ఫరూఖ్ నగర్ లో ఘనంగా ఖురాన్ పోటీల బహుమతి ప్రదానోత్సవం

వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న

మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు కాలనీలలో భక్తిశ్రద్ధలతో గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడిని దర్శించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు, భక్తులు చైర్‌పర్సన్‌కు ఘన స్వాగతం పలికారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పట్టణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.ఈ పూజా కార్యక్రమాల్లో కౌన్సిలర్లు గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి, గుగులోత్ నీలా లచ్చిరాం, మల్లు ఉపేందర్ రెడ్డి, గంట్ల సుధాకర్ రెడ్డి, భాషిపంగు వెంకన్న, సంపత్, మంగు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: