బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రాణి–శివ వివాహానికి జడ్జి ప్రభాకర్‌కు ఆహ్వానం

Home.

రాణి–శివ వివాహానికి జడ్జి ప్రభాకర్‌కు ఆహ్వానం

రాణి–శివ వివాహానికి జడ్జి ప్రభాకర్‌కు ఆహ్వానం   సీఎం సమావేశంలో ఉన్నందున స్వయంగా రాలేకపోతున్నా.. తప్పక వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించ

మూడో వార్డులో పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను
వామపక్ష విద్యార్థి సంఘా నాయకులపై పెట్టిన కేసును వెంటనే వెతివేయాలి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్
విద్యార్థులకు మద్దతు ప్రకటిస్తే పోలీసు కేసులా జిల్లేడు చౌదరి గూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు

రాణి–శివ వివాహానికి జడ్జి ప్రభాకర్‌కు ఆహ్వానం

 

సీఎం సమావేశంలో ఉన్నందున స్వయంగా రాలేకపోతున్నా.. తప్పక వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

 

జడ్జి ప్రభాకర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన పులిమామిడి శ్రీశైలం గౌడ్

 

నమస్తే భారత్ షాద్ నగర్, ఆగస్టు 25:షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి–శివల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ నాంపల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి గుబ్బ ప్రభాకర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు.ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తరఫున మాజీ కౌన్సిలర్ పులిమామిడి శ్రీశైలం గౌడ్ జడ్జి ప్రభాకర్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జడ్జి ప్రభాకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి సమావేశం నిమిత్తం సెక్రటేరియట్‌లో ఉన్నందున తాను స్వయంగా వచ్చి ఆహ్వానించలేకపోతున్నానని, తన కార్యకర్త పులిమామిడి శ్రీశైలం గౌడ్ ద్వారా వివాహ పత్రిక పంపిస్తున్నానని తెలిపారు.రాణి–శివల వివాహానికి తప్పక హాజరై వధూవరులను ఆశీర్వదించాలని జడ్జి ప్రభాకర్‌ను ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేకంగా కోరారు.వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన కార్యక్రమంలో సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు జడ్జి గుబ్బ ప్రభాకర్‌కు సమీప మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా వ్యవహరిస్తున్న డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయతను చాటుకున్నారు.

వివాహ వేడుకకు ఆహ్వానం అందుకున్న జడ్జి ప్రభాకర్ సానుకూలంగా స్పందించి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: