బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం

Homeతెలంగాణ

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం సిపిఎం (మం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్, ఆర్గనైజర్ బాణాల రాజన్న నమస్తే భారత్ :-మారిపెడ వీ

పాపన్నపేటలో డ్రైనేజీ పనులు ప్రారంభం
ప్రభుత్వ హామీల సాధన కోసం చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి టిజిఇజేఏసి అడిషనల్ సెక్రటరీ జనరల్ కీసర రమేష్ రెడ్డి
ప్రజాపాలన దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్,

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం

సిపిఎం (మం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్, ఆర్గనైజర్ బాణాల రాజన్న

నమస్తే భారత్ :-మారిపెడ

వీరనారి చాకలి ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తితో భూస్వామ్య, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు,సిపిఎం మరిపెడ మండలంలోని కార్మికులతో కలిసి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్మికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గుండ గాని మధుసూదన్.మాట్లాడుతూ.నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూస్వామ్య దోపిడీకి ఎదురునిలిచి,పేదలు–రైతులు–కార్మికుల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా.నిలిచిపోయిందన్నారు. భయపెట్టినా, బెదిరించినా, అణచివేయాలని ప్రయత్నించినా వెనక్కి తగ్గకుండా తన భూమి కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం.నేటి.తరానికి.స్ఫూర్తిదాయకమన్నారు.నేటికీ సమాజంలో భూమి, ఉపాధి, విద్య, వైద్యం, కనీస వేతనాలు, కార్మిక హక్కులు, మహిళలపై హింస, సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను.పరిష్కరించకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు.ప్రజల హక్కులను హరించే విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్య ప్రజా ఉద్యమాలే మార్గమని అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఐలమ్మ పోరాట వారసత్వాన్ని కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా.. ప్రజల నిత్యజీవిత సమస్యలపై పోరాటాలుగా మలచడమే ఆమెకు నిజమైన నివాళి అని గుండ గాని మధుసూదన్ పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను గుర్తించి, గ్రామగ్రామాన ప్రజలను సమీకరించి, దోపిడీకి వ్యతిరేకంగా.. హక్కుల సాధన కోసం.. సమసమాజ నిర్మాణం కోసం సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, పోలబోయిన వీరయ్య భూక్య శ్రీనివాస్, గుగులోతు రమేష్, మధ్య, గుండె శీను, లింగమూర్తి, గుగులోతు బాల, పర్షబోయిన రమేష్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0