శాస్త్రీయ నృత్యంలో అక్షయ అద్భుత ప్రదర్శన నమస్తే భారర్ షాద్ నగర్,నవంబర్14; మనసుకు హత్తుకునే అహభావాలతో అక్షయ కూచిపూడి నృత్య ప్రదర్శన చూపకురులను ఎంతగా
శాస్త్రీయ నృత్యంలో అక్షయ అద్భుత ప్రదర్శన
నమస్తే భారర్ షాద్ నగర్,నవంబర్14; మనసుకు హత్తుకునే అహభావాలతో అక్షయ కూచిపూడి నృత్య ప్రదర్శన చూపకురులను ఎంతగానో ఆకట్టుకుంది. శనివారం హైదరాబాద్ బొగ్గులకుంటలో సంగీత కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన శంకరాభరణం – స్వర, నృత్య పుష్పాంజలి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణానికి చెందిన నాట్య నివేదాలయం నాట్య గురువు భార్గవి శిష్యురాలు అక్షయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్షయతో పాటు కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, శాస్త్రీయ కళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాకారులు అద్భుతమైన హావభావాలు, లయబద్ధమైన నృత్య విన్యాసాలతో సభికుల ప్రశంసలు అందుకున్నారు.
సంగీత కళానిలయం అధ్యక్షురాలు అనిత ప్రియదర్శిని ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా, కళాభిమానులు, నృత్య ప్రియులు పాల్గొని ప్రదర్శనలను ఆస్వాదించారు.

COMMENTS