బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి జంతర్ మంతర్ ధర్నాకు మద్దతుగా కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని సీపీఐ నిరసన

Homeతెలంగాణ

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి జంతర్ మంతర్ ధర్నాకు మద్దతుగా కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని సీపీఐ నిరసన

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి జంతర్ మంతర్ ధర్నాకు మద్దతుగా కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని సీపీఐ నిరసన నమస్తే భారత్ :-మరిపె

ధూమపానానికి దూరంగా ఉండాలి
మరిపెడ బంగ్లాలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని గణపతి మండపంలో లక్కీ డ్రా
జాతీయ సేవా పథకం (NSS) దినోత్సవం ప్రత్యేకం

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
జంతర్ మంతర్ ధర్నాకు మద్దతుగా కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని సీపీఐ నిరసన

నమస్తే భారత్ :-మరిపెడ

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాకు మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో మరిపెడ బంగ్లా మండలంలోని ఎస్బీఐ కాలనీలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టడం ఎన్నికల కమిషన్ బాధ్యత అని అన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలిగించే పరిణామాలపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఆ హక్కును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని, ఎన్నికల కమిషన్‌పై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతను గుర్తిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ తరఫున డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి పగిళ్ల అంజి, పట్టణ సహాయ కార్యదర్శి వీరేందర్, పానుబోతు రాములు, వెంకన్న, లింగయ్య, రమేష్, శీను, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: