*తెలంగాణ రైతంగా సాయుధ పోరాట అసలైన వారసులు కమ్యూనిస్టులే.* *వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట స్పూర్తితో ఉద్యమిద్దాం.* *సిపిఎం జిల్లా నాయకులు* *ఎన్ రా
*తెలంగాణ రైతంగా సాయుధ పోరాట అసలైన వారసులు కమ్యూనిస్టులే.*
*వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట స్పూర్తితో ఉద్యమిద్దాం.*
*సిపిఎం జిల్లా నాయకులు*
*ఎన్ రాజు*
నమస్తే భారత్ షాద్ న గర్,సెప్టెంబర్10. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఫరూక్నగర్ మండల ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసురాలు చిట్యాల ఐలమ్మ గారి 41వ వర్ధంతిని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎన్ రాజు షాద్నగర్ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడారు తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం భుక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగిందని అన్నారు విసునూరు రామచంద్రారెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా సాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తినిచ్చిందని అన్నారు సాకలి ఐలమ్మ తనకున్న నాలుగు ఎకరాల భూమిలో పంట వేసుకుంటే ఆ పంటను కోసుకోవడానికి విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు ప్రయత్నం చేస్తే ఆంధ్ర మహాసభ నాయకత్వంలో విసునూరు రామచంద్రారెడ్డి గుండాలను గుతుపలతో తరిమికొట్టి భూమిని పంటను కాపాడుకున్నటువంటి గొప్ప పోరాట నాయకురాలని కొనియాడారు ఆరోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది కాబట్టే 12 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పేదలకు పంచడం జరిగిందని అన్నారు వారి పోరాట స్ఫూర్తి తోటే నేటి ప్రభుత్వాలు అక్కడక్కడ భూములు పంచుతుండు అంటే ఆ పోరాట వారసత్వం అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు భూమిలేని పేదలకు భూములు పంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు నిజాం నిరంకుశ పాలనలో వారికి గులాములుగా జమీందార్లు,జాగీర్దార్లు,దేశ్‌ముఖ్‌లలో హిందువులైన జెన్నరెడ్డి ప్రతాపరెడ్డి,విసునూర్ రామచంద్రారెడ్డి, లాంటి దుర్మార్గులు ఉన్నారని ఇలాంటి ఆగడాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి,వెట్టిచాకిరి విముక్తి కోసం పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలా దేవి, భీమి రెడ్డి నర్సింహ్మా రెడ్డి,తోలి అమరుడు దొడ్డి కొమరయ్య, వీరనారి చాకలి ఐలమ్మ,కాచం క్రిష్ణ మూర్తి, (రాగన్న), ముస్లింలైనా షేక్ బందాగి ముఖ్ధుం మొహియుద్దీన్,షోయబుల్లా ఖాన్, అల్లం కుందిమీరి లాంటి మహనీయులు మరెందరో చేసిన పోరాటం ద్వారా చైతన్యం పొందిన మట్టి మనుషులు తిరుగుబాటుతో ధిక్కార స్వరాలై ‘‘బాంచన్ దొర కాల్మొక్త’’ అన్న వెట్టి మనుషులు చేత ‘‘దొర ఏందిరో నీ దోర పికుడేందిరో’’ అంటూ బందూకులు పట్టించిన. కమ్యూనిస్టులు నడిపిన పోరాట మదిని కొనియాడారు.4వేల మంది వీర మరణం పొందారన్నారు. అ పోరాటమే ఫలితమే 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని 3 వేలకు పైగా గ్రామ స్వరాజ్యాలు ఎర్పాటు చేసిన చరిత్రాత్మకమైన పోరాటమన్నారు. కానీ కులం పేర మతం పేర,ప్రాంతం పేరుతో జరిగిన పోరాటం కాదని కానీ ఆ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని కాషాయ మూకలు హిందూ, ముస్లిం పేరుతో మతం రంగు పులిమి బిజెపి రాజకీయ పబ్బం గడుపుకోవాడాని హిందూ ముస్లింలపై మధ్యన చిచ్చు పెట్టుతుందన్నారు. నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రికరిస్తున్నారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలతో కమ్యూనిస్టుల పోరాట చరిత్రను తూడిపేయాలని “రజాఖార్ ఫైల్స్” లాంటి సినిమాలు తీసి సమాజంలోని నేటి యువతి యువకులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పోరాట చైతన్యం కలిగిన వారని బిజెపి మత రాజకీయాలు ఈ గడ్డపై సాగ నివ్వరని హెచ్చరించారు. భూమికోసం, భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన అ పోరాట వారసత్వాన్ని స్పూర్తితో ప్రజ సమస్యలపై సిపిఎం పనిచేస్తుందని భవిష్యత్తులో షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో చాలా సమస్యలు ఉన్నాయని స్థానిక సమస్యలపై ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులుకార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఈశ్వర్ నాయక్ చంద్రమౌళి కావాలి రాజు ఆంజనేయులు గౌడ్ బాలరాజ్ రాజు భుజంగారెడ్డి చెన్నయ్య జనార్ధన్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS