బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

శంషాబాద్ మండలంలో రూ. 2.75 కోట్ల హెచ్‌ఎండిఏ నిధులతో అభివృద్ధి పనులు

Homeతెలంగాణ

శంషాబాద్ మండలంలో రూ. 2.75 కోట్ల హెచ్‌ఎండిఏ నిధులతో అభివృద్ధి పనులు

శంషాబాద్ మండలంలో రూ. 2.75 కోట్ల హెచ్‌ఎండిఏ నిధులతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబ

*గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః*
మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారం ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్
అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఉన్న నిరుపయోగ డబ్బాను వెంటనే తొలగించాలి: డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ

శంషాబాద్ మండలంలో రూ. 2.75 కోట్ల హెచ్‌ఎండిఏ నిధులతో అభివృద్ధి పనులు

శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 05,శంషాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే ఆయా గ్రామ సర్పంచుల సమక్షంలో ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని గురువారం పాలమకుల, మేకల బండ తండా, పిల్లోనిగూడ మదనపల్లి పాత తండాలలో హెచ్‌ఎండిఏ నిధులు సుమారు రూ. 2.75 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మండల పరిధిలోని పాలమాకుల,పిల్లోని గూడ మేకల భాయి తండా, మదనపల్లి తండా తదితర గ్రామాల్లో హెచ్ఎండి ఏ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సిసి రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందన్నారు., తండాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రజల సౌకర్యార్థం అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు తండావాసులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: