బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రాగంపేటలో పేరుకుపోయిన చెత్త.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

Homeతెలంగాణ

రాగంపేటలో పేరుకుపోయిన చెత్త.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

రాగంపేటలో పేరుకుపోయిన చెత్త.. ప్రజలకు తప్పని ఇబ్బందులు ఖానాపురం నవంబర్ 6 (నమస్తే భారత్ ) : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చెత్త

నూతన ఎస్ఐ బాణోతు వెంకన్నకు ఘన సన్మానం
పిఆర్టీయూ–టీఎస్ జిల్లా నూతన కార్యవర్గంలో మరిపెడ మండల ఉపాధ్యాయులకు సముచిత స్థానం
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రాగంపేటలో పేరుకుపోయిన చెత్త.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

ఖానాపురం నవంబర్ 6 (నమస్తే భారత్ ) :
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చెత్త పేరుకుపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉండటంతో పారిశుద్ధ్య సమస్య నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
గ్రామంలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, పారిశుద్ధ్య నిర్వహణపై సరైన శ్రద్ధ చూపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కార్యదర్శి ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అదేవిధంగా గ్రామ సర్పంచ్ స్థానికంగా అందుబాటులో లేకపోవడం, ప్రజా సమస్యలను పట్టించుకునే వారు లేకపోవడంతో గ్రామస్థులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి రాగంపేట గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని, చెత్త తొలగింపుతో పాటు గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: