బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

జొన్నగిరిలో త్వరలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్

Homeతెలంగాణ

జొన్నగిరిలో త్వరలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్

జొన్నగిరిలో త్వరలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ ట్రివేణి లాయిడ్స్ స్వర్ణగిరి ఆధ్వర్యంలో నిర్వహణ తుగ్గలి, నవంబర్ 4( నమస్తే భారత్): క్రీడా

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ వృద్ధుడి కుటుంబానికి బియ్యం,ఆర్థిక సహాయం
కేబుల్ ఛానల్ జర్నలిస్టుల పోరాటానికి టీడబ్ల్యూజేఎఫ్ సంపూర్ణ మద్దతు టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మల్లేష్ గౌడ్
వైభవంగా కే ఎస్ ఆర్ స్కూల్లో బోనాల పండుగ

జొన్నగిరిలో త్వరలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్

ట్రివేణి లాయిడ్స్ స్వర్ణగిరి ఆధ్వర్యంలో నిర్వహణ

తుగ్గలి, నవంబర్ 4( నమస్తే భారత్):

క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రికెట్ క్రీడాకారులలో ఐక్యత, ఉత్సాహాన్ని ప్రోత్సహించేందుకు ట్రివేణి లాయిడ్స్ స్వర్ణగిరి (గోల్డ్ మైన్స్ )ఆధ్వర్యంలో జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో త్వరలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సంస్థ ఏజీఎం కోటేశ్వరరావు, పీఆర్వో రాజేష్ తెలిపారు.
ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న క్రికెట్ క్రీడాకారులు 11 మంది సభ్యులతో ఒక జట్టును ఏర్పాటు చేసుకుని, జట్టు సభ్యుల పేర్లను ముందుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. జట్ల నమోదు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్ని జట్లు పాల్గొంటున్నాయనే వివరాలను సంస్థ యాజమాన్యానికి తెలియజేసి, టోర్నమెంట్ నిర్వహణ తేదీతో పాటు విజేతలకు అందించే బహుమతులను ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, పోటీల నిర్వహణకు అనువుగా జొన్నగిరి హైస్కూల్ క్రీడా మైదానాన్ని సిద్ధం చేసే పనులు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. మైదానం తయారీ, ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
క్రీడల పట్ల ఆసక్తి ఉన్న క్రికెట్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి జట్లను నమోదు చేసుకుని, ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కోటేశ్వరరావు, రాజేష్ కోరారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: