*ఇంద్రన్న కాలనీలో ఇందిరమ్మ మహిళా భవనం నిర్మించాలి.* *-సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్.* బాచుపల్లి మండలం, నిజాంపేట్ సర్కిల్ పరిధ
*ఇంద్రన్న కాలనీలో ఇందిరమ్మ మహిళా భవనం నిర్మించాలి.*
*-సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్.*
బాచుపల్లి మండలం, నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఇంద్రన్న కాలనీలో కాలనీ వాసుల అవసరానికి ఇందిరమ్మ మహిళా భవన్ కమిటీ హాల్ కావాలని బాచుపల్లి మండల కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ గత పదిహేను సం,, రల నుండి స్థానిక ప్రజలతో ఇంద్రన్న కాలనీ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ తో కలిసి ఆ కాలనీ వాసిగా, కాలనీ అధ్యక్షునిగా అనేక సార్లు కలెక్టర్ కి, ఆర్డీఓ కి, మండల తహసీల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అని అన్నారు. వాణి రెడ్డి గారు బాచుపల్లి మండల తహసీల్దార్ గా వచ్చిన తరువాత కలెక్టర్ నుండి సర్వే చేయమని ఆర్డర్ పంపారు. తహసీల్దార్ అప్పుడు సర్వేయర్ గా ఉన్న సింధు కి సర్వే చేయమని మెమో ఇచ్చారు. సింధు కాలయాపన చేసింది కానీ ఇప్పడి వరకు సర్వే చేయలేదు.అని అన్నారు. ఆలాగే కొంత ఓటు నమోదు కార్యక్రమం వల్ల ఆలస్యం అయింది అని గుర్తు చేశారు. కనుక ఇప్పుడైనా ఇందిరమ్మ మహిళా భవన్ నిర్మాణం చేసే విధంగా సర్వే చేసి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పొన్నకంటి దస్తగిరి, నర్సింహా, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS