బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సబ్‌స్టేషన్‌లో మద్యం కలకలం.. విచారణ ఎప్పుడు ?

Homeతెలంగాణ

సబ్‌స్టేషన్‌లో మద్యం కలకలం.. విచారణ ఎప్పుడు ?

సబ్‌స్టేషన్‌లో మద్యం కలకలం.. విచారణ ఎప్పుడు ? ఖానాపురం అక్టోబర్ 30 (నమస్తే భారత్ ) : ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాల్సిన బాధ్యత కలిగిన

*లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం*
ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రత.. సమస్యల పరిష్కారం కోసం నిరంతర సేవ!
నూతన కరెంటు పోల్‌కు వీధి లైట్ ఏర్పాటు

సబ్‌స్టేషన్‌లో మద్యం కలకలం.. విచారణ ఎప్పుడు ?

ఖానాపురం అక్టోబర్ 30 (నమస్తే భారత్ ) : ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాల్సిన బాధ్యత కలిగిన విద్యుత్ శాఖ సిబ్బంది విధి నిర్వహణ సమయంలోనే మద్యం సేవించినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఖానాపురం మండలం మంగళవారిపేట సబ్‌స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యుత్ శాఖ పనితీరుపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అక్టోబర్ 29 గురువారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో లైన్ ఇన్‌స్పెక్టర్‌తో రాజుతో పాటు
ఎస్ ఎల్ ఐ ,ఇద్దరు ఏఎల్ ఎంలు , ముగ్గురు అన్ మ్యాన్డ్ ఉద్యోగులు ,సబ్ స్టేషన్ ఆఫరేటర్ సబ్‌స్టేషన్‌లో మద్యం సేవించినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో కారణాలు తెలుసుకునేందుకు సబ్‌స్టేషన్‌కు వెళ్లిన రైతులకు సిబ్బంది మద్యం మత్తులో కనిపించినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో పలువురు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోగా, లైన్ ఇన్‌స్పెక్టర్ పిట్టల రాజు మాత్రం మద్యం మత్తులో అక్కడే ఉండిపోయాడు.
ఇదే సబ్‌స్టేషన్ పరిధిలోని నాజీతండాకు చెందిన మహిళా కౌలు రైతు భూక్యా మంగమ్మ ఈ నెల 25న విద్యుదాఘాతంతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన జరిగి కొద్ది రోజులకే సబ్‌స్టేషన్‌లో సిబ్బంది మద్యం సేవించినట్లు ఆరోపణలు రావడం రైతుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.
విద్యుత్ సరఫరా, విద్యుత్ ప్రమాదాల నివారణ, అత్యవసర సమయాల్లో స్పందన వంటి కీలక బాధ్యతలు నిర్వహించే సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సమయంలో మద్యం సేవించినట్లు ఆరోపణలు రావడం ప్రజల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

*ఉన్నతాధికారుల విచారణ ఏది* ?

ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సంబంధిత సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారా? విధి నిర్వహణ సమయంలో మద్యం సేవించినట్లు ఆరోపణలు నిజమైతే శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు, విద్యుత్ భద్రతకు సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: