బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడ పోలీసుల చాకచక్యం. అక్రమ నల్లబెల్లం రవాణాకు చెక్

Homeతెలంగాణ

మరిపెడ పోలీసుల చాకచక్యం. అక్రమ నల్లబెల్లం రవాణాకు చెక్

మరిపెడ పోలీసుల చాకచక్యం. అక్రమ నల్లబెల్లం రవాణాకు చెక్ సినిమా తరహాలో బొలెరో వాహనాన్ని వెంబడించి పట్టివేత.. రూ.1.50 లక్షల విలువైన నల్లబెల్లం స్వాధీన

*మాల విద్యార్థి గర్జనను విజయవంతం చేయాలి*
మరిపెడ పీహెచ్‌సీలో లెప్రసీ వ్యాధిపై అవగాహన శిక్షణ
స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ, సందీప్ బల్లెం కో ఫౌండర్..

మరిపెడ పోలీసుల చాకచక్యం. అక్రమ నల్లబెల్లం రవాణాకు చెక్

సినిమా తరహాలో బొలెరో వాహనాన్ని వెంబడించి పట్టివేత.. రూ.1.50 లక్షల విలువైన నల్లబెల్లం స్వాధీనం

నమస్తే భారత్ :-మరిపెడ

అనుమానాస్పద వాహనాలపై నిఘా.తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదలని పట్టుదల.చివరకు అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పట్టిక పట్టివేత! మరిపెడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. గిరిపురం ఎక్స్‌ రోడ్డు వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఇద్దరిని పట్టుకున్నారు.అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం గిరిపురం ఎక్స్‌ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన బొలెరో వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వాహనదారులు ఆపకుండా.తప్పించుకునేందుకు యత్నించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వాహనాన్ని వెంబడించి అడ్డుకుని తనిఖీ చేయగా, అందులో భారీగా నల్లబెల్లం, పట్టిక ఉన్నట్లు గుర్తించారు.
వాహనంలో 30 బస్తాల నల్లబెల్లం, 2 బస్తాల పట్టికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.వాహనంలో ఉన్న ఇద్దరిని విచారించగా, వారు చోక్ల తండాకు చెందిన బానోత్ కిషన్, బానోత్ నవీన్‌గా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ నుంచి తక్కువ ధరకు నల్లబెల్లం, పట్టిక కొనుగోలు చేసి పరిసర తండాల్లో విక్రయిస్తున్నట్లు వారు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.అనుమానాస్పద వాహనాన్ని గుర్తించి, అది ఆపకుండా.వెళ్లేందుకు.ప్రయత్నించినప్పటికీ వెంబడించి పట్టుకోవడంలో మరిపెడ పోలీసులు చూపిన అప్రమత్తత, చాకచక్యం ప్రశంసనీయం. వాహన తనిఖీల ద్వారా అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాకుండా, అనుమానితులను అదుపులోకి తీసుకుని సరుకును స్వాధీనం చేసుకోవడం పోలీసుల నిఘా వ్యవస్థ పనితీరును చాటిచెప్పింది.ఈ ఘటనపై ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: