బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి

Homeతెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి నమస్తే భారత్ :-తొర్రూరు :ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్

మహాత్మా జ్యోతిబాపూలే స్కూల్ లో వైద్యశిబిరం
మరిపెడ పట్టణ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గంగుల వెంకటేష్
దుర్గామాత సేవలో కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

:ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి, యువత భవిష్యత్తు కోసం నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చారు. పట్టభద్రులంతా సమయం పాటించి ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల,పట్టణ కార్యదర్శులు నల్లమాస ప్రమోద్ కుమార్, కౌన్సిలర్లు కర్నే నాగరాజు, పేర్ల జంపన్న, గిరిజన నాయకులు ధరావత్ జై సింగ్ నాయక్,టికు నాయక్,6వ అధ్యక్షుడు రాయిశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: