మాజీ ఎంపీటీసీ రాజులపాటి లచ్చమ్మ కు నివాళి - కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ నీకాసైనా నాయకురాలు ను కోల్పో
మాజీ ఎంపీటీసీ రాజులపాటి లచ్చమ్మ కు నివాళి – కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్
కాంగ్రెస్ పార్టీ నీకాసైనా నాయకురాలు ను కోల్పోయింది – మండల అధ్యక్షులు సమ్మిగౌడ్
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మండల అధ్యక్షులు -అల్లం నాగేశ్వర్ రావు
నమస్తే భారత్ :-కేసముద్రం
కేసముద్రం మండలం లోని ఇంటికన్నే గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ, సీనియర్ నాయకురాలు రాజులపాటి లచ్చమ్మ మృతి చెందిన విషయం స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,వార్డ్ సభ్యులు బొల్లం రమేష్ ద్వారా విషయం తెలుసుకున్న కేసముద్రం మండలపార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్ ఇంటికన్నే గ్రామానికి వెళ్లి రాజులపాటి లచ్చమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించి ఆమె పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని, ఇలాంటి క్లిష్ట పరిస్థితి లో వారి కుటుంబం మెనోదైర్యాన్ని కోల్పోకుండా ఉండేలా భగవంతుడు తోడుగా ఉండాలని.కోరారు.రాజులపాటి లచ్చక్క, వారి కుటుంబం దశబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అనీ, వారికుటుంబానికి మండల, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు..లచ్చమ్మ మృతిపట్ల పట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, PACS వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు సంతాపం తెలియజేసి నివాళి అర్పించారు..ఆమె భౌతికకాయంపై కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువతో దహన సంస్కారాలు చెయ్యాలని కోరారు.. లచ్చమ్మ భర్త రాజులపాటి కట్టయ్య కాగా, కుమారులు రాజులపాటి అశోక్, వెంకన్న, దేవేందర్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో లచ్చక్క కుటుంబ సభ్యులు అల్లం వెంకన్న,ఇంటికన్నె గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజులపాటి మల్లయ్య, మిట్ట గడుపుల యాకయ్య, ఎండీ నిజాముద్దీన్, బోళ్ల రమేష్ యాదవ్, గాదే శీను, మల్లెల లక్ష్మీనారాయణ, రాజులపాటి ఉప్పలయ్య, బోళ్ల హరీష్, వర్ధిల్లి రంజిత్ గౌడ్, కొల్లూరి వెంకన్న, బెజ్జం శివ, చంద్రు తండా సర్పంచ్ బానోత్ శీను నాయక్, నల్లమాస ఉప్పలయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

COMMENTS