దారం శ్రీనుకు పట్టణ ప్రముఖుల పరామర్శ నమస్తే భారత్ :-మరిపెడ అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దారం సుప్రియ తండ్రి దారం శ్రీను వారి
దారం శ్రీనుకు పట్టణ ప్రముఖుల పరామర్శ
నమస్తే భారత్ :-మరిపెడ
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దారం సుప్రియ తండ్రి దారం శ్రీను వారి కుటుంబ సభ్యులను మరిపెడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నాగరాజు, సత్యం (హోటల్), మాజీ కో ఆప్షన్ మెంబర్ షేక్ మక్సుద్.సోమవారం పరామర్శించారు. ఖమ్మంలోని ఎదులాపురం మున్సిపాలిటీలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. సుప్రియ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాల్యం నుంచి చదువుల్లో చురుగ్గా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉండే సుప్రియ మృతి కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసిందని.. కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని, సుప్రియ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం సుప్రియ చిత్రపటానికి నివాళి అర్పించారు.

COMMENTS