బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ జన్మదిన వేడుకలు

Homeతెలంగాణ.

కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ జన్మదిన వేడుకలు

కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ చ

ఎన్ సీసీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి సీకేఎం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య
వాహనాల బహిరంగ వేలం ఎక్సైజ్ సి ఐ ఆర్ నరేష్ రెడ్డి
కోరుకొండ పల్లి గ్రామంలో ఘనంగా కుంకుమార్చన పూజకార్యక్రమం

కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ జన్మదిన వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల నాయకులు

400 మంది కాంగ్రెస్ శ్రేణులతో తో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు – అధ్యక్షులు సమ్మిగౌడ్ చిలువేరు

కేసముద్రం మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు – కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ జన్మదిన వేడుకలను కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా,పండుగ వాతావరణంలో కేసముద్రం మండలం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తో కలిసి నిర్వహించారు.మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ జన్మదిన వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ చైర్మన్ గౌరవ గంట సంజీవరెడ్డి మరియు పార్టీ సీనియర్.నాయకులు,ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్ కు కేక్ తినిపించి,పార్టీ కుటుంబ సభ్యుల తో కలిసి ఎమ్మెల్యే మురళీ నాయక్ కి కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్బంగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవ రెడ్డి.మాట్లాడుతూ మండలం లోని 400 మంది కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పుట్టినరోజు చేసుకున్న మానుకోట ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ ఎంతో అదృష్టవంతులు అని, వారి సేవలు కేసముద్రం ఇంకా ఎన్నో చెయ్యాల్సి ఉందని, ఎమ్మెల్యే గెలుపుకోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటూ పార్టీ ని ముందుకు నడిపించాలని, వారు ఆయూర్ ఆరోగ్యాలతో ఉండి మరింత రాజకీయంగా ఎదగాలని కోరుకున్నారు.
కేసముద్రం మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో స్థానిక మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధుల తో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు,ప్రజాప్రతినిధులు, మాజీ.ప్రజాప్రతినిధులు,మండలం లోని అన్ని గ్రామ కమిటీ సభ్యులు,పార్టీ అధ్యక్షులు,మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంగాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు మరియు ఎమ్మెల్యే అభిమానులు సుమారు 400 మందికి పైగా పెద్ద ఎత్తున పాల్గొని భారీ కేక్ కట్ చేసి మానుకోట శాసనసభ్యులు మురళీనాయక్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ.
ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిజెస్తూ వారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు, కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పరితపించే మురళి నాయక్ నాయకత్వంలో మహబూబాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, భవిష్యత్తులో ప్రజల ఆశీస్సులతో ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని కోరారు.ఈ శుభసందర్బంగా పార్టీ ని,మానుకోట ఎమ్మెల్యే మురళీ నాయక్ గారిని నమ్ముకొని తన గెలుపు కోసం అహర్నిశలు కస్టపడి పని చేసిన ప్రతీ కార్యకర్తను,వారి శ్రమను గుర్తించి వరకు అండగా ఉండాలని,ఇక ముందు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసారు ..
ఈ పుట్టినరోజు వేడుకలో పీసీసీ సభ్యులు దస్రు నాయక్, టౌన్ పార్టీ అధ్యక్షులు రావుల మురళీ,అల్లం నాగేశ్వర్ రావు,అంబటి మహేందర్ రెడ్డి,వీరేష్ యాదవ్,ఆయూబ్ ఖాన్,బండారు వెంకన్న,కదిరే సురేందర్, బండారు దయాకర్,దామరకొండ ప్రవీణ్,బానోత్ వెంకన్న,బట్టు శ్రీనివాస్,భద్యనాయక్,ప్రభురాని,దనమ్మ,మహేందర్ గౌడ్,సర్పంచ్ లు బాలాజీ రెడ్డి, వీరాస్వామి,సూరయ్య,సంతోష్ నాయక్,సుమన్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రామచంద్రు,నాయకులు సామల నర్సయ్య, పోలేపాక ఉప్పలయ్య,వోలం రాజు, చిదిరాల వసంత రావు, వోలం రాజు,రియాజ్ ఖాన్,మండలం లోని అన్ని గ్రామాల ఉపసర్పంచ్ లు,వార్డు సభ్యులు,కమిటీ అధ్యక్షులు,కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు మురళి నాయక్ అభిమానులు పాల్గొన్నారు..

COMMENTS

WORDPRESS: 0
DISQUS: