బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

“నీరు కనిపించడానికి స్వచ్ఛంగా ఉండటం సరిపోదు; శాస్త్రీయంగా పరీక్షించినప్పుడే అది సురక్షితమైన నీరని చెప్పగలం.”

Homeతెలంగాణ

“నీరు కనిపించడానికి స్వచ్ఛంగా ఉండటం సరిపోదు; శాస్త్రీయంగా పరీక్షించినప్పుడే అది సురక్షితమైన నీరని చెప్పగలం.”

"నీరు కనిపించడానికి స్వచ్ఛంగా ఉండటం సరిపోదు; శాస్త్రీయంగా పరీక్షించినప్పుడే అది సురక్షితమైన నీరని చెప్పగలం." ప్రపంచంలో జీవం కొనసాగడానికి గాలి తర్వాత

ప్రజాకవి కాళోజీకి ఘన నివాళులు
సంకు సుగుణమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్
మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం!

“నీరు కనిపించడానికి స్వచ్ఛంగా ఉండటం సరిపోదు; శాస్త్రీయంగా పరీక్షించినప్పుడే అది సురక్షితమైన నీరని చెప్పగలం.”
ప్రపంచంలో జీవం కొనసాగడానికి గాలి తర్వాత అత్యంత ముఖ్యమైన సహజ వనరు నీరు. కానీ నేడు జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, రసాయన వ్యవసాయం, మురుగునీటి కలుషితం, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నీటి నాణ్యత వేగంగా దిగజారుతోంది. ఈ పరిస్థితిలో ప్రతి పౌరుడు తన ప్రాంతంలోని నదులు, చెరువులు, సరస్సులు, వాగులు, భూగర్భ జలాల నాణ్యతను శాస్త్రీయంగా పరిశీలించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 2003లో ప్రారంభమై, ప్రస్తుతం “ప్రపంచ జల రక్షణ సవాలు” రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతోంది.ఇది ప్రభుత్వాలకే పరిమితమైన కార్యక్రమం కాదు; విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులు కూడా “సిటిజెన్ సైంటిస్ట్స్ “గా ఇందులో పాల్గొంటున్నారు.
ఎందుకు జల పర్యవేక్షణ అవసరం?
నీరు పారదర్శకంగా కనిపిస్తే అది సురక్షితమని అనుకోవడం పెద్ద పొరపాటు. కంటికి కనిపించని సూక్ష్మజీవులు, రసాయనాలు, భారీ లోహాలు, అధిక ఆమ్లత్వం లేదా క్షారత్వం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు.
కాలుష్యమైన నీటి వల్ల:
విరేచనాలు
టైఫాయిడ్
కాలరా
హెపటైటిస్
చర్మవ్యాధులు
మూత్రపిండ సమస్యలు
వంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నీటి భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ, ప్రమాద విశ్లేషణ, స్థానిక స్థాయి పరీక్షలను ప్రోత్సహిస్తోంది.నీటి ఉష్ణోగ్రత కేవలం వేడి లేదా చల్లదనాన్ని మాత్రమే సూచించదు; అది నీటిలో జీవం నిలవడాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
ఉష్ణోగ్రత ప్రభావం
5°C అధిక ఆక్సిజన్
10°C మంచి స్థితి
20°C సాధారణ సహజ స్థితి
30°C పైగా ఆక్సిజన్ తగ్గడం ప్రారంభం
ప్ర ఆ సం,ప్రకారం ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీటిలో కరిగిన ఆక్సిజన్ తగ్గుతుంది. 5°C వద్ద నీటిలో సుమారు 12.8 mg/L, 10°C వద్ద 11.3 mg/L, 20°C వద్ద 9.1 mg/L వరకు ఆక్సిజన్ సహజంగా కరిగి ఉంటుంది.
ఉష్ణోగ్రత ఎందుకు ముఖ్యం?
చేపల శ్వాసపై ప్రభావం చూపుతుంది.
ఆల్గీ (పాచిపూత) పెరుగుదలను ప్రభావితం చేస్తుంది.
నీటిలో రసాయన చర్యలు వేగవంతమవుతాయి.మురుగునీటి కలుషితం
చెత్త
అధిక ఉష్ణోగ్రత
నిల్వ నీరు
పాచిపూత అధికంగా పెరగడం
కరిగిన ఆక్సిజన్ తగ్గినప్పుడు “డెడ్ జోన్స్ ” ఏర్పడి చేపలు పెద్దఎత్తున చనిపోయే పరిస్థితి వస్తుంది.
4. టర్బిడిటీ
టర్బిడిటీ అంటే నీరు ఎంత మసకగా ఉందో తెలిపే ప్రమాణం.
కారణాలు
మట్టి
ఇసుక
ఆల్గీ
ప్లాస్టిక్ సూక్ష్మకణాలు
సేంద్రీయ వ్యర్థాలు
టర్బిడిటీ ఎక్కువగా ఉంటే:
సూర్యకాంతి అడుగుకు చేరదు.
మొక్కల పెరుగుదల తగ్గుతుంది.
సూక్ష్మజీవులు దాగి ఉండే అవకాశం పెరుగుతుంది.శుద్ధి చేసిన తాగునీటిలో టర్బిడిటీని తక్కువ స్థాయిలో ఉంచాలని సూచిస్తుంది. సూచించిన విధానం ప్రకారం ప్రతి నమూనాకు సరైన రికార్డు నిర్వహించడం అత్యంత ముఖ్యం.
ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి?
పరీక్ష మంచి స్థితి
pH 6.5–8.5
DO 6–10 mg/L
టెంపరేచర్ 20–30°C (సహజ నీటికి సాధారణ పరిధి)
తురబీడీటీ తక్కువ
టీడీస్ 300–600 mg/L
ఒక్కసారి పరీక్షించి నిర్ణయం తీసుకోవడం సరిపోదు. ఒకే ప్రదేశంలో నెలకొకసారి పరీక్ష చేస్తే కాలక్రమంలో మార్పులను గుర్తించవచ్చు.ప్రతి పౌరుడు సంవత్సరానికి కనీసం ఒకసారి:
పి హెచ్ పరీక్ష,
కరిగిన ఆక్సిజన్ పరీక్ష,
టెంపరేచర్ నమోదు,
టీడీస్ కొలత,
తురబీడీటీ పరిశీలన
చేసి స్థానిక సంస్థలకు సమర్పిస్తే ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణకు బలమైన డేటా వ్యవస్థ ఏర్పడుతుంది.
ముగింపు
ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవం ఒక వేడుక మాత్రమే కాదు—ప్రజా శాస్త్ర ఉద్యమం. ప్రభుత్వాలు ప్రయోగశాలల్లో పరీక్షలు చేస్తాయి; కానీ ప్రతి పౌరుడు తన పరిసరాల్లోని నీటిని శాస్త్రీయంగా పరిశీలిస్తేనే నిజమైన జల భద్రత సాధ్యమవుతుంది. నేడు ఒక pH పరీక్ష, ఒక DO కొలత, ఒక నీటి నమూనా రేపటి తరాల ఆరోగ్యాన్ని కాపాడగలదు.
“ప్రతి నీటి బొట్టు విలువైనది – ప్రతి పౌరుడు జల సంరక్షకుడే.”
— మధుబాబు చికిలే
స్కిలోక్రాట్ | జాతీయ డైరెక్టర్, ప్రపంచ మానవ హక్కుల సమితి.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: