ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా మక్తల్ మార్కెట్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ నమస్తే భారత్,, 17/9/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ మార్కెట్ కార్యాలయంలో ప్
ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా మక్తల్ మార్కెట్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ
నమస్తే భారత్,, 17/9/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ మార్కెట్ కార్యాలయంలో
ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం మక్తల్ మార్కెట్ కార్యాలయంలో ప్రజాపాలనా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి రాధా లక్ష్మారెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. గణేశ్ కుమార్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎం. శ్రీనివాసులు గారు, టి. నాగరాజు గారు, మొహమ్మద్ ఫయాజ్ గారు, నాగప్ప గారు, ట్రేడర్లు కృష్ణారెడ్డి గారు, సూర్యనారాయణ గారు, హమాలీ సంఘం నాయకులు, హమాలీలు, మార్కెట్ కార్యాలయ సిబ్బంది, సూపర్‌వైజర్ లింగప్ప గారు మధు గారు భాస్కర్ గారు మైను గారు నిజాం గారు అంజమ్మ గారు పార్వతమ్మ గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ రాధా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా మక్తల్ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలకు మరింత మెరుగైన పాలన, మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు.

COMMENTS