బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు ఒకరు మృతి

Homeతెలంగాణ

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు ఒకరు మృతి

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు ఒకరు మృతి మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం సెప్టెంబర్ 7,(నమస్తే భారత్) ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి

*మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారు*
బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్న, i బిఆర్ఎస్, అధ్యక్షులు, మహేశ్వర్ రెడ్డి
అంగన్‌వాడీ సిబ్బంది సర్టిఫికెట్ల పరిశీలన మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ,

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు ఒకరు మృతి

మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం సెప్టెంబర్ 7,(నమస్తే భారత్)

ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతిచెందినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.ఆయన తెలిపిన కథనం మేరకు వివరాలు…మండలంలోని గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల కుమార్(35) వ్యవసాయం పనులు చేస్తూ జీవితం గడుపుతున్నాడు.కాగా సోమవారం చిత్రియాల తండా వద్ద ఓ వ్యక్తి వద్దకు కూలీ పనులకు వెళ్లి అక్కడ ఉన్న ఇనుప పైపులను ట్రాక్టర్ లో లోడ్ వేస్తున్నారు.కుమార్ ఇనుప పైపుని లేపి ట్రాక్టర్ లో వేస్తుండగా ఆ పైప్ అదుపుతప్పి ముందు భాగంలో పైన ఉన్న 11 కేవీ కరెంట్ వైర్ కు తాకడంతో ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి కింద పడి స్రృహ కోల్పోయి పడిపోయాడు.వెంటనే అక్కడ ఉన్న వారు గమనించి వైద్యం కోసం మెదక్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించగా అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే కుమార్ మృతి చెందినట్లు తెలిపారు.మృతుడి భార్య దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: