డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం * కాంగ్రెస్ మండల పార్టీ అధ్య
డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం
* కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్
నమస్తే భారత్ :-కేసముద్రం
ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు (సోమవారం) మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద భారీ నిరసన ర్యాలీ, దిష్టిబొమ్మ దహన కార్యక్రమం డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ నిరసన కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, NSUI మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి కార్యకర్త బాధ్యతగా పాల్గొనాలని కోరారు.మండలంలోని ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఐక్యతను చాటాలని సమ్మయ్య గౌడ్ కోరారు.

COMMENTS