బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

దళిత గిరిజనులకు చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

Homeతెలంగాణ

దళిత గిరిజనులకు చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

దళిత గిరిజనులకు చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి అంబేద్కర్ అభయ హస్తం పథకం వెంటనే అమలు చేయాలి సామాజిక అసమానతలపై గ్రామాలలో అవగాహన సదస్సులు న

అంగన్‌వాడీ సిబ్బంది సర్టిఫికెట్ల పరిశీలన మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ,
4వ వార్డు ప్రజల కోసం ఆరోగ్య శిబిరం
సెప్టెంబర్ 1న టిజిఈ జెఏసి పిలుపు మేరకు తపస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన.

దళిత గిరిజనులకు చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

అంబేద్కర్ అభయ హస్తం పథకం వెంటనే అమలు చేయాలి

సామాజిక అసమానతలపై గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ జీసభ్యులు అల్వాల వీరయ్య
మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్

నమస్తే భారత్:-మరిపెడ

చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎన్నికల హామీల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెప్టెంబర్ 27 ఆదివారం రోజున మరిపెడ మండలం గుండెపూడి శాఖ సమావేశం గ్రామ కార్యదర్శి బోడపట్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న నేటికీ దళిత గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తూ మోసం చేస్తుందని అన్నారు దళితులు రాష్ట్రంలో 17% గిరిజనులు 10% ఉన్నారని సమాజంలో కుల వివక్ష అంటరానితనం అవమానం ఆకలితో ఉపాధి లేమితో బాధపడుతున్న వారి నాదుకోవడంలో నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గిరిజనులు మోసం చేస్తుందని అన్నారు మైదాన ప్రాంత గిరిజనులు ఆదివాసి గిరిజనులు కొండ కోనల్లో పట్టణ గ్రామాలకు దూరంగా ఉంటూ కనీస సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం లేదని రోడ్లు సైడ్ డ్రైనేజీ పల్లె దావకాన ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని అసైన్డ్ భూముల పునరుద్ధరణ చేస్తామని గత టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న అసైన్మెంట్ భూములను తిరిగి దళిత గిరిజనులకు ఇస్తామని చెప్పిన.మాట.నిలబెట్టుకోవాలని 2013 చట్టపకారం అసైన్మెంట్ భూములకు నష్టపరిహారం చెల్లించాలని నూతనంగా ఏర్పాటు చేసిన 3,146 గిరిజన తండాలకు రెవిన్యూ ఓదా కల్పించి 2000 కోట్ల నిధులు కేటాయించి తండాలలో కనీస సౌకర్యాలు అంతర్గత రహదారులు సైడ్ డ్రైనేజీ వ్యవస్థ పల్లె దావకానలు ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడి కేంద్రాల భవనాలు పశువుల దావకాన ఏర్పాటు చేయాలని అంబేద్కర్ అభయ హస్తం పథకం కింద దళిత గిరిజన యువతి యువకులకు 12 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో దళిత గిరిజనులు సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ గ్రామ కార్యదర్శి బోడపట్ల రాజశేఖర్ గ్రామ నాయకులు అల్లి శ్రీనివాస్ రెడ్డి షేక్ షరీఫ్ బింగి మహేష్ వడ్లకొండ ఉప్పలయ్య గంధసిరి మహేష్ బాసు నాయక్ భయ్యా సురేష్ తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: