బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తుమ్మిడికుంట తరహాలో పీరంచెరువును అభివృద్ధి చేయాలి

Homeతెలంగాణ

తుమ్మిడికుంట తరహాలో పీరంచెరువును అభివృద్ధి చేయాలి

తుమ్మిడికుంట తరహాలో పీరంచెరువును అభివృద్ధి చేయాలి హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు హరిష్ గౌడ్ విజ్ఞప్తి హైదరాబాద్ జంట నగరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో

పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేయాలి
సీతారాంపురంలో ఘనంగా ఏడవ రోజు కుంకుమ పూజ కార్యక్రమం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉమేష్‌ను పరామర్శించిన నవీన్ రావు

తుమ్మిడికుంట తరహాలో పీరంచెరువును అభివృద్ధి చేయాలి

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు హరిష్ గౌడ్ విజ్ఞప్తి

హైదరాబాద్ జంట నగరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించబడిన నల్లచెరువు, సున్నం చెరువు, తుమ్మిడికుంట తరహాలోనే రాజేంద్రనగర్ నియోజకవర్గం, GHMC 123వ డివిజన్ హైదర్షాకోట్ పరిధిలోని పీరంచెరువును కూడా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ గారిని నల్లగొప్పుల హరిష్ గౌడ్ కలిసి విజ్ఞప్తి చేశారు.

పీరంచెరువు ప్రస్తుతం మురుగునీరు చేరడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని, మరోవైపు చెరువు భూములు ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

చెరువులో పేరుకుపోయిన మురుగునీరు, వ్యర్థాలను తొలగించి, చెరువు పరిధిలోని ఆక్రమణలను అరికట్టి, పూడికతీత పనులు చేపట్టి, చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోరారు. అంతేకాకుండా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పచ్చదనం, పార్కులు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విజ్ఞప్తిపై హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పీరంచెరువును స్వయంగా సందర్శించి, పరిస్థితులను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పీరంచెరువు పునరుద్ధరణతో పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని హరిష్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నల్లగొప్పుల హరిష్ గౌడ్
GHMC 123వ డివిజన్ – హైదర్షాకోట్

COMMENTS

WORDPRESS: 0
DISQUS: