బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నీటిపారుదల చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి

Homeతెలంగాణ

నీటిపారుదల చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి

నీటిపారుదల చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి పాఖాల అభివృద్ధికి రూ.150 కోట్లు చిన్న చెరువుల అభివృద్ధికి రూ.100 కోట్లు జిల్లా క

పుట్టినరోజు శుభాకాంక్షలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
అంతర్గత రోడ్ల దుస్థితిని పట్టించుకోండి.. వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలి – కొండ ఉప్పలయ్య
సీఎం వ్యాఖ్యలకు నిరసన

నీటిపారుదల చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి

పాఖాల అభివృద్ధికి రూ.150 కోట్లు

చిన్న చెరువుల అభివృద్ధికి రూ.100 కోట్లు

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, అక్టోబర్ 15 (మల్లేష్ నమస్తే భారత్ ) :

నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పాఖాల సరస్సు సాగునీటీ పనుల అభివృద్ధితో పాటు చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధికి అవసరమైన పనుల ప్రతిపాదనలను సమగ్రంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబధిత అధికారులకు సూచించారు.గురువారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
పాఖాల అభివృద్ధికి రూ.150 కోట్లు, 47 చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధికి రూ.100 కోట్లతో చేపట్టనున్న పనులకు సంబంధించి కమిటీ రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని సంబధిత అధికారులను ఆదేశించారు. నీటి వనరుల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణ, సాగునీటి సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా సూచించారు.
ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకెఎస్ వై ) పథకం కింద చేపట్టాల్సిన పనులపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, ప్రతిపాదనలను సమగ్రంగా రూపొందించాలని తెలిపారు. పనుల అమలుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించాలని, నర్సంపేట నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కృపాకర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ స్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుదర్శన్, సీజీడబ్ల్యూడీ అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ తారిఖ్, నర్సంపేట ఆర్డీవో, డీఆర్‌డీఏ పీడీ, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ సంగీత తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: