బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*నీటి పొదుపు మాటలకే పరిమితమా..?*

Homeతెలంగాణ

*నీటి పొదుపు మాటలకే పరిమితమా..?*

*నీటి పొదుపు మాటలకే పరిమితమా..?* *15 రోజులుగా పైప్‌లైన్ లీకేజీ.. వృథాగా పోతున్న తాగునీరు..!* *నర్సప్పగూడ ఆరో వార్డులో పట్టించుకోని గ్రామపంచాయతీ

ఎల్ ని నో ప్రభావం పై తట్టుపల్లిలో అవగాహన కార్యక్రమం.
యాదవ సంఘం మండల కమిటి ఎన్నిక
తాతా మధుపై చర్యలు తీసుకోవాలి – శాసన మండలి నుంచి బర్తరఫ్ చేయాలి

*నీటి పొదుపు మాటలకే పరిమితమా..?*

*15 రోజులుగా పైప్‌లైన్ లీకేజీ.. వృథాగా పోతున్న తాగునీరు..!*

*నర్సప్పగూడ ఆరో వార్డులో పట్టించుకోని గ్రామపంచాయతీ పాలకవర్గం.*

నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్10: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసి భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచిస్తున్న గ్రామపంచాయతీ పాలకవర్గం.. ఆచరణలో మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలోని ఆరో వార్డులో మాజీ సర్పంచ్ కావలి కృష్ణ ఇంటి సమీపంలో గత 15 రోజులుగా పైప్‌లైన్ లీకేజీతో విలువైన తాగునీరు వృథాగా రోడ్డుపై పారుతోంది. నీటి కొరత ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో ఇంతకాలంగా లీకేజీ కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకవైపు గ్రామ సర్పంచ్ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని గ్రామ వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు గ్రామంలోనే 15 రోజులుగా తాగునీరు వృథాగా పోతున్నా ఎందుకు మరమ్మతులు చేపట్టడం లేదని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు నీటి పొదుపుపై సూచనలు చేయడమే కాకుండా, నీటి వృథాను అరికట్టే బాధ్యతను కూడా పాలకవర్గం తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఆరో వార్డు సభ్యుడు, పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పైప్‌లైన్ లీకేజీని మరమ్మతు చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి ప్రతి బొట్టును విలువైనదిగా భావించాల్సిన ఈ సమయంలో తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకొని ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా అందించాలని కోరుతున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: