రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలకు హరిపిరాల విద్యార్థులు ఎంపిక నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల హైస్కూల్ లో చదువుత
రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలకు హరిపిరాల విద్యార్థులు ఎంపిక
నమస్తే భారత్ :-తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల హైస్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గ్రూప్- ఏ లో వై. యశ్వంత్ గ్రూపు- బి లో సిహెచ్ ప్రవీణ్ లు రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం బి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ చెంచర్ల స్వాతి రాజు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఎంపికైన విద్యార్థులను, డ్రాయింగ్ మాస్టర్ నిమ్మల రవి లను ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల ఎన్ టి పి సి వారు ” సేవ్ ద పవర్- ఫ్యూచర్ జనరేషన్” అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో సుమారు 1300 పాఠశాలల నుండి 5200 పెయింటింగ్స్ పోటీ పడగా ఇందులో నుండి 50 బెస్ట్ పెయింటింగ్స్ ను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయగా తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం గర్వకారణం అన్నారు. ఈనెల 18న హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ప్రతిభ చూపించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుధాకరా చారి, మధుకర్ రెడ్డి రాజేశ్వర్ సంపత్ సంపత్ కుమార్ ఆంజనేయులు కోటేశ్వర్ రాజు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు

COMMENTS