*ప్రభుత్వ పాఠశాలలు మేధావులకు పుట్టినిల్లు.. చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు* చండూరు నమస్తే భారత్ నవంబర్ 5 గురువారం
*ప్రభుత్వ పాఠశాలలు మేధావులకు పుట్టినిల్లు.. చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు*
చండూరు నమస్తే భారత్ నవంబర్ 5
గురువారం చండూరు ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులకు 275 స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చండూర్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఎందరో మేధావుల తయారీకి కేంద్ర బిందువులని,ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యాభివృద్ధి కోసమే కృషి చేస్తున్నాయన్నారు. కాకినాడకు చెందిన వసుధైక కుటుంబం యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ వారు అందజేసిన 275 స్కూలు బ్యాగులను ప్రధానోపాధ్యాయులు ఏ కోటీశ్వర్ రెడ్డి సమక్షంలో విద్యార్థులకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా అందజేశారు. సమన్వయకర్తగా వ్యవహరించిన పాఠశాల ఉపాధ్యాయుడు కళ్లెం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్న వసుదైక కుటుంబం గ్రూపు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మండల విద్యాధికారి వీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువును తమ బాధ్యతగా స్వీకరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు బి సైదులు పాఠశాల ప్రగతి నివేదికను సమర్పించారు. తెలుగు ఉపాధ్యాయుడు మద్దోజు సుధీర్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రుల సమక్షంలో తరగతి వారీగా అందజేశారు. ప్రభుత్వ పాఠశాల పనితీరు పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ విజయలక్ష్మి, జి కరుణాకర్ రెడ్డి, కె సతీష్, ఏ రాజు, కే శ్రీనివాస్ పాల్గొన్నారు.

COMMENTS