బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*దళిత మహిళలపై దాడి: దోషులను కఠినంగా శిక్షించాలి*

Homeతెలంగాణ

*దళిత మహిళలపై దాడి: దోషులను కఠినంగా శిక్షించాలి*

*దళిత మహిళలపై దాడి: దోషులను కఠినంగా శిక్షించాలి* నమస్తే భారత్ : నిజాంపేట్ విలేకరి ప్రగతి నగర్ ,మిథిలా నగర్ రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ పరిధిలోని

*పదేళ్ల నాటి బోరుతో.. నీటి కష్టాలకు చెక్.. !*
అనాథ బాలికకు పెద్దన్నగా అండ.. భరోసా కల్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు!
తొర్రూరులో అప్పలు చేస్తున్న కౌన్సిలర్ బి.ఐలమ్మ

*దళిత మహిళలపై దాడి: దోషులను కఠినంగా శిక్షించాలి*
నమస్తే భారత్ : నిజాంపేట్ విలేకరి ప్రగతి నగర్ ,మిథిలా నగర్

రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ పరిధిలోని అల్మాస్‌గూడ ప్రాంతంలో బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు దళిత మహిళలపై భౌతిక దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నాయకుడు టీ. స్వైలాబ్ బాబు తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం బైబిల్ లేదా ఇతర మతపరమైన కరపత్రాలు పంపిణీ చేయడం పౌరుల మత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా సంబంధిత అధికారులకు తెలియజేయాలే తప్ప, మహిళలపై బూతులతో విరుచుకుపడటం, భౌతిక దాడులకు దిగడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటే తీవ్ర బాధ కలిగిస్తోందన్నారు.పోలీసుల తక్షణ జోక్యానికి డిమాండ్:తెలంగాణ పోలీసులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత మహిళలకు పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళల గౌరవానికి, మత స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఖండించాలని, రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని స్వైలాబ్ బాబు కోరారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: