అనాథ బాలికకు పెద్దన్నగా అండ.. భరోసా కల్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు! నాయనమ్మను కోల్పోయిన బొద్దుల అఖిలకు అండగా నిలిచి.. చదువు, భవిష్యత్తుకు
అనాథ బాలికకు పెద్దన్నగా అండ.. భరోసా కల్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు!

నాయనమ్మను కోల్పోయిన బొద్దుల అఖిలకు అండగా నిలిచి.. చదువు, భవిష్యత్తుకు భరోసా
కుటుంబానికి ఒక క్వింటాల్ బియ్యం, రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేత
ధనముంటే సరిపోదు.. ఆపదలో ఆదుకునే గుణముండాలి: పీసీసీ సభ్యుడు గుగులోత్ దస్రు నాయక్
నమస్తే భారత్ :-కేసముద్రం
కన్నవారికి దూరమై , నాయనమ్మే సర్వస్వంగా బతుకుతున్న ఆ బాలికకు ఆ ఆసరా కూడా దూరమైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బొద్దుల అఖిలకు కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ అండగా నిలిచారు. నువ్వు ఒంటరిదానివి కాదు.నీకు అన్నగా నేనున్నా’ అంటూ ఆప్యాయంగా భరోసానిచ్చారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబానికి ఒక క్వింటాల్ బియ్యం, రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన బొద్దుల అఖిల జీవితం చిన్ననాటి నుంచే విషాదాలతో నిండిపోయింది. అఖిల తల్లి,తండ్రి బొద్దుల శ్రీనివాస్ రెండేళ్ల వయసులోనే దూరమై కన్నవారి ప్రేమను కోల్పోయి అనాధలాగా మిగలాగా అప్పటి నుంచి నాయనమ్మ స్వరాజ్యం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అఖిలను అల్లారుముద్దుగా పెంచి పోషించింది. తనకు ఉన్నదంతా మనవరాలి భవిష్యత్తేనని భావించి, ఆమె చదువుకు అండగా నిలిచింది.
నాయనమ్మ ప్రోత్సాహంతో చదువులో రాణించిన అఖిల కాట్రపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం వరంగల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ విద్యాసంస్థలో ఉన్నత విద్య అభ్యసిస్తోంది. ఇలాంటి సమయంలో నాయనమ్మ స్వరాజ్యం మరణించడంతో అఖిలకు దిక్కెవరనే ప్రశ్న ఎదురైంది. తనను కంటికి రెప్పలా కాపాడిన నాయనమ్మ దూరం కావడంతో ఆ బాలిక కన్నీరుమున్నీరైంది.సర్వస్వం నాయనమ్మే అనుకొని బ్రతుకుతున్న అఖిల చివరకు ఆమెకే తలకొరవి పెట్టాల్సిన కన్నీటి సముద్రం లో పడేసాడు దేవుడు అని గ్రామ ప్రజలు పాప ను చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు దీనితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
అఖిలకు అన్నగా అండగా సమ్మయ్య గౌడ్
అఖిల నాయనమ్మ స్వరాజ్యం మరణవార్త ను కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు జల్లే యాకంభ్రం, ప్రభాకర్ ద్వారా తెలుసుకున్న కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ వెంటనే కాట్రపల్లి గ్రామానికి చేరుకున్నారు. నాయనమ్మను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అఖిలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ‘నువ్వు ఒంటరిదానివి కావు.. నీకు ఒక అన్నగా నేను అండగా ఉంటాను. నీ చదువు, భవిష్యత్తు విషయంలో నీకు తోడుగా నిలుస్తాను’ అంటూ భరోసానిచ్చారు.
అంతేకాకుండా ఆ కుటుంబానికి ఒక క్వింటాల్ బియ్యం, రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి తక్షణ సహాయం అందించడంతో పాటు బాలిక భవిష్యత్తుపై భరోసా కల్పించారు. గ్రామ పెద్దలు, కుల సంఘం నాయకులతో కలిసి అంత్యక్రియల నిర్వహణలోనూ భాగస్వామ్యమయ్యారు.
ధనముంటే సరిపోదు.. ఆపదలో ఆదుకునే గుణముండాలి
ఈ సందర్భంగా పీసీసీ సభ్యుడు గుగులోత్ దస్రు నాయక్ మాట్లాడుతూ,కేవలం ధనం ఉంటే సరిపోదని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే మంచి మనసు ఉండాలని పేర్కొన్నారు. నాయనమ్మను కోల్పోయి అనాథగా మిగిలిన బాలికకు అన్నగా అండగా నిలవడంతో పాటు, ఆమె కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన చిలువేరు సమ్మయ్య గౌడ్ సేవాభావాన్ని అభినందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
సర్పంచ్ ఎదురబోయిన సురయ్య,జల్లె యాకాంభ్రం మాట్లాడుతూ మన కేసముద్రం లోనే కాకుండా మండలం లోని అన్ని గ్రామాల్లో ఏ కాదుభీదవాడి ఇంట్లో విషాదం జరిగినా, ఆపదలో ఉన్నా సమ్మిగౌడ్ దృష్టికి తీసుకెళ్లండి అనే రీతిలో సమ్మిగౌడ్ సేవలు ఉన్నాయని,బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్న సమ్మన్న సేవలు మరువలేనివి అన్నారు..అఖిలకు భవిష్యత్తులోనూ తోడ్పాటు అందిస్తామని తెలిపారు. నాయనమ్మను కోల్పోయిన బాలికకు ఆప్యాయతను పంచుతూ, ఆమె కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన చిలువేరు సమ్మయ్య గౌడ్ స్పందనపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సామల నర్సయ్య ఉపసర్పంచ్ షాగంటి యాదగిరి, సిరికొండ మల్లయ్య, పుట్ట ప్రభాకర్, జాటోత్ లక్ష్మణ్, రుద్ర యాదగిరి, దాసరి శ్రీనివాస్, బేతూ సత్యం, సాంబారి వీరాస్వామి, కర్పూరపు వెంకటేశ్వర్లు, నల్లగొప్పుల సాయిలు, బోదాసు చంద్రయ్య, సిరికొండ వెంకన్న, అడప రవీందర్, ఓర్సు ముత్తయ్య, నాయిని స్వామి, యెడల్లి దేవరాజు,దేవులపల్లి కట్టయ్య,జినుకల శ్రావన్, నూణావత్ మాను, పాలికోజు బీష్మచారి మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, పద్మశాలి కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS