బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

Homeతెలంగాణ

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం నమస్తే భారత్ :-తొర్రూరు అంగన్వాడి కేంద్రాలలో అందించే పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని చర్లపాలెం సర్పంచ్ ధర్మారపు మహ

భూమి,భుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనషుల తిరుగుబాటే సాయుధ పోరాటం
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ
పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..!

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నమస్తే భారత్ :-తొర్రూరు

అంగన్వాడి కేంద్రాలలో అందించే పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని చర్లపాలెం సర్పంచ్ ధర్మారపు మహేందర్ అన్నారు. శనివారం మండలంలోని చర్లపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహించే పోషణ మాసంలో భాగంగా ఈసీసీఈ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిడిపిఓ విజయలక్ష్మితో కలిసి సర్పంచ్ మహేందర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టిక ఆహారాన్ని.తీసుకోవాలన్నారు.పోషకాలతో కూడిన ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్యకర జీవన శైలి పెంపొందించుకోవాలని కోరారు. అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, అంగన్వాడి సూపర్వైజర్ నాగమణి, అంగన్వాడి టీచర్లు రజిత,చంద్రకళ,బాలింతలు,గర్భిణీలు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: