బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ముదిరెడ్డి కమలమ్మకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నివాళి

Homeతెలంగాణ

ముదిరెడ్డి కమలమ్మకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నివాళి

ముదిరెడ్డి కమలమ్మకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నివాళి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన మ

ఉత్తమ ఉపాధ్యాయురాలు కవితకు ఘన సన్మానం
మూడో వార్డులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం
గోపాలరావుపేటలో వైభవంగా అన్నదాన కార్యక్రమం

ముదిరెడ్డి కమలమ్మకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నివాళి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన ముదిరెడ్డి లక్ష్మారెడ్డి కుటుంబానికి చెందిన కమలమ్మ (నరేష్ రెడ్డి నాయనమ్మ) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం వారి నివాసానికి చేరుకుని కమలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ముదిరెడ్డి లక్ష్మారెడ్డి, నరేష్ రెడ్డిలను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారికి మనోధైర్యం కల్పిస్తూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఓడీఎస్ఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి, వర్మారెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: