బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఆర్యవైశ్య విద్యావిభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనిల్ కుమార్

Homeతెలంగాణ

ఆర్యవైశ్య విద్యావిభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనిల్ కుమార్

ఆర్యవైశ్య విద్యావిభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనిల్ కుమార్ నమస్తే భారత్ :-తొర్రూరు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్యా విభాగం, స్కాలర్షిప్స్ వ

70,వ,, sgf, మండల స్థాయి క్రీడ పోటీలు జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ఫుల్మామిడి గ్రామంలో నిర్వావరణ దాతలు డాక్టర్, దూది ప్రనేస్ కుమార్
అబ్బాయిపాలెంలో కోతులను నివారించాలి.
*సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహదినమే.*

ఆర్యవైశ్య విద్యావిభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనిల్ కుమార్

నమస్తే భారత్ :-తొర్రూరు

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్యా విభాగం, స్కాలర్షిప్స్ వితరణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తొర్రూరు కు చెందిన వజినపల్లి అనిల్ కుమార్ నియామకం పొందారు. ఆదివారం రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరు గౌరీ శంకర్ సమక్షంలో నియామక పత్రాన్ని అందుకున్నారు. రెండేళ్ల క్రితం వరకు అనిల్ కుమార్ మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా, సుదీర్ఘకాలం తొర్రూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు అండగా నిలిచే విద్యా కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనిల్ కుమార్ కు ప్రాతినిధ్యం లభించడం ఈ ప్రాంతంలో పేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్ల మంజూరు కోసం ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతల అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణకు, ఉపాధ్యక్షులు గౌరీ శంకర్ తోపాటు జిల్లా బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పేద ఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నత చదువులకు.చేయూతననిచ్చేందుకు దాతృత్వం కలిగిన ప్రతి ఒక్కరు తగిన ఆర్థిక సహకారాన్ని అందజేసేందుకు స్వచ్ఛందంగా రాష్ట్ర మహాసభ విద్యా కమిటీని సంప్రదించాలని అనిల్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా సంఘ అధ్యక్షులు తల్లాడ వెంకట రామారావు, కోశాధికారి సామ రామూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ తొర్రూరు అధ్యక్షులు మచ్చ సురేష్, కోశాధికారి చిదిరాల శ్రీనివాస్, తాటికొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: