భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఆసియా పారా గేమ్స్ పతకాల విజేత రవి కార్తీక్ బుడిగిన జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 6 ప్రేమ్ కిరణ్ జప
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఆసియా పారా గేమ్స్ పతకాల విజేత రవి కార్తీక్ బుడిగిన
జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 6 ప్రేమ్ కిరణ్
జపాన్లో ఇటీవల ముగిసిన ప్రతిష్ఠాత్మక ఆసియా పారా గేమ్స్ స్విమ్మింగ్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి, ఏకంగా మూడు పతకాలు సాధించి దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ఇంటర్నేషనల్ స్విమ్మర్
జంగారెడ్డిగూడెం కు చెందిన సీనియర్ న్యాయవాది
బుడిగిన నాగేంద్ర కుమార్ కుమారుడు రవి కార్తీక్ బుడిగిన కు అరుదైన దక్కింది. రవి కార్తీక్ యొక్క అద్భుత ప్రతిభను గుర్తించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయనను అభినందించేందుకు ఆహ్వానం పంపారు. ఆ ఆహ్వానం మేరకు రవి కార్తీక్ బుడిగిన ప్రధానమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రవి కార్తీక్ను ప్రత్యేకంగా అభినందిస్తూ, దేశానికి మూడు మెడల్స్ సాధించి క్రీడారంగంలో యువతకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఒక సాధారణ ప్రాంతం నుంచి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో మూడు మెడల్స్ సాధించడమే కాకుండా, సాక్షాత్తూ భారత ప్రధానమంత్రి నుంచే ప్రశంసలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు

COMMENTS