నార్సింగి మార్కెట్లో నూతన షెడ్ల ప్రారంభోత్సవం నమస్తే భారత్ – నవంబర్ 6 (గండిపేట మండలం): నార్సింగి మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన షెడ్లను ర
నార్సింగి మార్కెట్లో నూతన షెడ్ల ప్రారంభోత్సవం
నమస్తే భారత్ – నవంబర్ 6 (గండిపేట మండలం):
నార్సింగి మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన షెడ్లను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్, డైరెక్టర్లు తలారి ప్రేమ్ కుమార్, బాలరాజ్ కుమార్, లక్ష్మీ శ్రీ, వైస్ చైర్మన్ దశరథ్ యాదవ్, సాదిక్, కిరణ్, రాము యాదవ్, మార్కెట్ కమిటీ సెక్రటరీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారులకు నూతన షెడ్లతో మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-గండిపేట మండల రిపోర్టర్ శ్రీనివాస్

COMMENTS