బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఇందిరమ్మ కోట్రాస్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Homeతెలంగాణ.

ఇందిరమ్మ కోట్రాస్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

ఇందిరమ్మ కోట్రాస్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన నమస్తే భారత్ – నవంబర్ 6 (గండిపేట మండలం): వట్టినాగులపల్లి గ్రామంలోని ఇందిరమ్మ కోట్రా

*మెదక్‌లో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు విస్తృత పర్యటన*
సీప్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్కుమార్ ని రాజీనామా చేయాలని డిమాండ్
మహబూబ్ నగర్ జిల్లా

ఇందిరమ్మ కోట్రాస్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

నమస్తే భారత్ – నవంబర్ 6 (గండిపేట మండలం):

వట్టినాగులపల్లి గ్రామంలోని ఇందిరమ్మ కోట్రాస్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు దుల్చన్ సిస్పాల్ సింగ్, మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ గొల్ల నాగేష్ యాదవ్, గండిపేట్ డివిజన్ ప్రెసిడెంట్ మన్నె నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మైలారం ప్రదీప్ కుమార్, మాజీ వార్డు సభ్యులు కుమ్మరి చంద్రశేఖర్, బుడాల అరుణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, స్థానికుల ఇబ్బందులు తొలగి కాలనీ అభివృద్ధికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సోమయ్య రాజు ముదిరాజ్, సోమయ్యల విట్టల్ ముదిరాజ్, మంగళవారం మాణిక్యం యాదవ్, ఎరుకలి మాణిక్యం, మేకల లక్ష్మణ్ రెడ్డి, నవీన్ రెడ్డి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

– గండిపేట మండల రిపోర్టర్ శ్రీనివాస్

COMMENTS

WORDPRESS: 0
DISQUS: