బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ వేడుకల్లో

Homeతెలంగాణ.

మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ వేడుకల్లో

మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ

ఫీజు బకాయి బిజెపి లడాయి నిరాహార దీక్షలో పాల్గొన్న మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ మెదక్,
అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డేవిడ్ రాజ్‌ను పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు
రగిలే నిప్పు కణం.షహీద్ భగత్ సింగ్.డా.కుమార్ నాయక్ డుంగ్రోతు.

మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ వేడుకల్లో

పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్,

మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్‌తో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొని పండుగ సందడిని తీసుకొచ్చారు.
అనంతరం మున్సిపల్ సిబ్బందికి దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి దుస్తులు పంపిణీ చేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, మెప్మా సభ్యులు, మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: