బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

11వ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి మోటార్ ప్రారంభం

Homeతెలంగాణ.

11వ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి మోటార్ ప్రారంభం

11వ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి మోటార్ ప్రారంభం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జ

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి Rs.50,000/- రూపాయల విరాళం ఇచ్చి మొక్కు తీర్చుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,,
గుండేపూడిలో ఘనంగా 119.షాహిద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు
*ఉట్కూర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి*

11వ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి మోటార్ ప్రారంభం

మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో స్థానిక ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన మోటార్‌ను శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు.
వార్డులో ప్రజలకు నీటి సరఫరా సక్రమంగా అందించడంతో పాటు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు మోటార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ సత్యవతి యుగంధర్, మాజీ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, భాషిపంగు రవికాంత్, కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు భాషిపంగు సైదులు, మున్సిపల్ బాధ్యుడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: