బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సహకరించాలి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

Homeతెలంగాణ

*ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సహకరించాలి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సహకరించాలి - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *పర్వతాపూర్ గ్రామంలో మహి

చిన్నారులను అభినందించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్
ఉత్తమ ఉపాధ్యాయురాలు కవితకు ఘన సన్మానం
పట్టభద్రుల ఎన్రోల్ మెంట్ కార్యక్రమంలో పాల్గిని తన పేరుని నమోదు చేసుకున్న డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు.

*ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సహకరించాలి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*పర్వతాపూర్ గ్రామంలో మహిళా సంఘ భవనం, బీసీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్14: కొందుర్గ్ మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్, మహిళా సంఘ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొని భవనాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు మాట్లాడుతూ.. పర్వతాపూర్ గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. గ్రామానికి ఇప్పటివరకు 37 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు, సుమారు రూ.40 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్ పనులకు నిధులు కేటాయించామని వెల్లడించారు. అలాగే గ్రామంలో 107 వీధి దీపాలను మంజూరు చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామంలో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్, మహిళా సంఘ భవనాలు ఆయా వర్గాల ప్రజలకు ఉపయోగపడతాయని, సామాజిక కార్యక్రమాలకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గామాత అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సూచన కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అనిత జితేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాదిక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, సర్పంచులు ఆంజనేయులు, అమర్నాథ్ రెడ్డి, నర్సింహులు, జంగయ్య, రాజ్ కుమార్, శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ అంజిరెడ్డి, మల్లేష్ గౌడ్, పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ రత్నమ్మ రాములు, మాజీ డిప్యూటీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు రాకేష్, వార్డు సభ్యులు సరిత నర్సింహులు, పద్మమ్మ మల్లేష్, సునీత అశోక్, డబ్బు నర్సింహులు, నాయకులు శ్యాంసుందర్, జంగయ్య, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: