బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

శాసన మండలిలో ఉద్యమకారుల గొంతుక ఉండాలి

Homeతెలంగాణ

శాసన మండలిలో ఉద్యమకారుల గొంతుక ఉండాలి

శాసన మండలిలో ఉద్యమకారుల గొంతుక ఉండాలి ఎమ్మెల్సీగా ఉద్యమకారులకు అవకాశం కల్పించాలి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ నమస్త

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి. టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆద్వర్యంలో డిమాండ్స్ డే
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం*
ఉపాధి కూలీల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

శాసన మండలిలో ఉద్యమకారుల గొంతుక ఉండాలి

ఎమ్మెల్సీగా ఉద్యమకారులకు అవకాశం కల్పించాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్

నమస్తే భారత్ :-తొర్రూరు

జరగబోయే శాసనమండలిలో తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక ఉండాలని, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని తెలంగాణ ఫోరం ఫౌండర్ చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ కోరారు. బుధవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని విశ్రాంతిభవనంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టియుఎఫ్) ఆధ్వర్యంలో మన ఓటు-మన గొంతుక వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జరగబోయే రెండు గ్లాడియేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులలో ఉద్యమకారులు లేరని అన్నారు. శాసనమండలిలో ఉద్యమకారుల గొంతు వినిపించాలని, అన్ని పార్టీలు ఉద్యమకారులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టియుఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, జిల్లా అధ్యక్షుడు ముద్దసాని వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు తాళ్ల మల్లయ్య, రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి, జిల్లా కో-ఆర్డినేటర్ కొండ వెంకన్న, జిల్లా కార్యదర్శి అనపురం వెంకన్న గౌడ్, నాయకులు వెంకన్న,విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: