జినక చిన్న వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపె
జినక చిన్న వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన
మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 3వ వార్డు సీతారాంపురం కాలనీకి చెందిన జినక చిన్న వెంకయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు వారి స్వగృహానికి వెళ్లి చిన్న వెంకయ్య చిత్రపటానికి పూలు సమర్పించి.నివాళులర్పించారు
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చిన్న వెంకయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రేఖ వెంకటేశ్వర్లు, కోచర్ల రవి, పెద్ద పాపయ్య, చిన్న పాపయ్య తదితరులు పాల్గొన్నారు

COMMENTS