బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న  ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Homeతెలంగాణ

ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-పాలకుర్తి పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ

కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో కేసముద్రంలో ఘనంగా గాంధీజీ 157వ జయంతి వేడుకలు
గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్
సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్

ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-పాలకుర్తి

పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాలకుర్తి పట్టణ మహిళలతో కలిసి పాల్గొన్న పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. ప్రకృతిని పూజిస్తూ, పూలను ఆరాధిస్తూ మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను చాటిచెబుతుంది. బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను, ఆనందాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ.ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: