చిన్నారులను అభినందించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్ర
చిన్నారులను అభినందించిన
కాంగ్రెస్ పార్టీ పట్టణ
అధ్యక్షుడు పానుగోతు రాంలాల్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని నాలుగో వార్డు గోపాల్‌రావుపేటలో చిన్నారులు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు స్వామివారిని.దర్శించుకున్నారు.ఉత్సవాల్లో భాగంగా చింత తారకేశ్వర్, చింత కార్తీక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత లడ్డూ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో లడ్డూను చింత తారకేశ్వర్, చింత కార్తీక్ దక్కించుకున్నారు.
అనంతరం మరిపెడ పోలీస్ సీఐ పవన్ కుమార్, ఎస్సై గండ్రతి సతీష్, డీజే లు బ్యాండ్ మేళం ముద్దు అనే నియమ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని సూచనల మేరకు, నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా నిర్వహించారు. డీజేలు, బ్యాండ్ మేళాలకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేపట్టి, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. భక్తి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ నిమజ్జనాన్ని నిర్వహించడం పట్ల కాంగ్రెస్ పార్టీ మరిపెడ పట్టణ అధ్యక్షులు పానుగోతు రాంలాల్,వినాయక కమిటీ సభ్యులు బాష్పంగు అనిల్, చింత తారకేశ్వర్, చింత కార్తీక్, కత్రోజ్ శీను, కత్రోజ్ యశ్వంత్, నందగిరి సాయిరాం,లను అభినందించారు
ఈ కార్యక్రమంలో వినాయక కమిటీ సభ్యులు బాష్పంగు అనిల్, బాష్పంగు శ్యామ్, చింత తారకేశ్వర్, చింత కార్తీక్, కత్రోజ్ శీను, కత్రోజ్ యశ్వంత్, నందగిరి సాయిరాం, జనార్ధన్, నవీన్, చరణ్, విష్ణు, నందగిరి మురళితో పాటు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

COMMENTS