బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో.మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న

Homeతెలంగాణ

గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో.మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న

గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో.మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు నమస్తే భా

బీజేపీ విధానాలకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలి
*టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్*
అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ

గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో.మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న

మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. యువతలో ఉత్సాహాన్ని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నవీన్ రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ గూగులోత్ వెంకన్న, గూగులోత్ రాంబాబు, పేపర్ శ్రీను, గ్రామ మాజీ సర్పంచ్ దిగజార్ల శ్వేత–ముఖేష్, మాణిక్యం, డాక్టర్ రవి, 5వ వార్డు కౌన్సిలర్ బోడ భాస్కర్, గంధసిరి కృష్ణ, గంట్ల మైపాల్ రెడ్డి, కొమ్ము నరేష్, రమేష్‌తో పాటు పలువురు ప్రముఖులు, యువకులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: