*రవీందర్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి* *రంగారెడ్డి జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్* *జన్మదినం సందర్భంగా వృద్ధాశ
*రవీందర్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి*


*రంగారెడ్డి జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్*
*జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం*
నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్17:షాద్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ జన్మదినం సందర్భంగా షాద్‌నగర్ బైపాస్‌లోని ఎఫ్ సి ఎన్ వృద్ధాశ్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈట గణేష్ మాట్లాడుతూ.. రవీందర్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ప్రార్థించారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఎం. ఎస్. నటరాజన్, లక్ష్మణ్ నాయక్, సర్పంచ్ గీత వీరేశం, కౌన్సిలర్లు శారద శేఖర్, మహమ్మద్ ఎజాజ్ (అడ్డు), పిన్నమోని గోపాల్, మాజీ కౌన్సిలర్లు జూపల్లి శంకర్, నంద కిషోర్, చిన్న యాదగిరి, మాజీ సర్పంచులు శ్రీనివాస్ యాదవ్, నరసింహా, గానం రమేష్, మాజీ ఎంపీటీసీలు శ్రీశైలం, ధార సురేష్, నాయకులు నక్కల వెంకటేష్, రవి యాదవ్, లంకాల రాఘవేందర్ రెడ్డి, బేగ్, పాపయ్య యాదవ్, చంద్రా రెడ్డి, రాఘవేందర్, భువనేశ్వర్ రెడ్డి, భిక్షపతి, గుండు అశోక్, కొండ మల్లేష్, చెర్క శివ, పవన్ సింగ్, మంగ శ్రీశైలం, సంతోష్ నాయక్, మల్లేష్, మణి, శేఖర్, మెహరాజ్, నరేందర్ రెడ్డి, స్వామి, బాలరాజు, రాజు, గణేష్, పాష తదితరులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

COMMENTS