పాపన్నపేట...22ఏ లో చేర్చిన రైతు భూములను తక్షణమే తొలగించాలి మెదక్ జిల్లా,పాపన్నపేట, సెప్టెంబర్ 2, (నమస్తే భారత్ ) మహాధర్నాలో బీజేపీ నేతల డిమాండ్
పాపన్నపేట…22ఏ లో చేర్చిన రైతు భూములను తక్షణమే తొలగించాలి
మెదక్ జిల్లా,పాపన్నపేట, సెప్టెంబర్ 2, (నమస్తే భారత్ )
మహాధర్నాలో బీజేపీ నేతల డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం 22ఏ లో చేర్చిన రైతు భూములను తక్షణమే తొలగించాలనీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.బుధవారం రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్,చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఏవైతే పొరపాటు చేసి 22 ఏ లో రైతుల భూములను చేర్చిందో వాటిని తక్షణమే తొలగించాలనీ,దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజు ఆధ్వర్యంలో పాపన్నపేట మండలం నుండి 60 మంది బిజెపి నాయకులు,కార్యకర్తలు తరలి వెళ్లినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బీకొండ రాములునేత,కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రన్న,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సిద్ధిరాములు, నార్సింగ్ ఉపసర్పంచ్ శ్రీరామ్ నరేష్,సీనియర్ నాయకులు దుర్గయ్య, డా.రాజేందర్,బుల్లెట్ యేసు,మాజీ జనరల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్, శంకర్ గౌడ్,నామపూర్ వార్డ్ మెంబర్ కుమార్, పాపన్నపేట సుంకరి కిష్టయ్య, కనకంటి విట్టల్
,దుర్గయ్య,గోపాల్, రామచందర్, వెంకట్,మల్లేశం,నాగరాజ్ తదితరులు వెళ్లిన వారిలో ఉన్నారు.

COMMENTS