బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు*

Homeతెలంగాణ

*రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు*

*రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు* *వెయ్యి రోజులు గడిచినా హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం!
అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రైతు వేదికలు..! -జిల్లా అధికారుల స్పందించాలి..
*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*

*రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు*

*వెయ్యి రోజులు గడిచినా హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి*

*కేసీఆర్ పాలనలో సంక్షేమం.. రేవంత్ పాలనలో సంక్షోభం*

*కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తీవ్ర ఆగ్రహం*

*షాద్‌నగర్‌లో 420 అడుగుల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ.. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ*

నమస్తే భారత్ షాద్‌నగర్,సెప్టెంబర్02: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, ఇచ్చిన హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఎన్నికల హామీల వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ముఖం చాటేసిందని మండిపడ్డారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి రోజులు పూర్తయినా ఒక్కొక్క హామీ కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, పేదలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందేవని అన్నారు. కానీ నేటి కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలకు కోతలు, బకాయిలు, కాలయాపన తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, కంటి వెలుగు, పల్లె దవాఖానాలు వంటి ప్రజలకు ఉపయోగపడిన అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రైతులకు సాగునీరు, పెట్టుబడి సాయం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు, యువతకు అవకాశాలు వంటి అంశాల్లో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సరైన దృష్టి పెట్టకుండా, అభివృద్ధి కార్యక్రమాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం ప్రతి ఏటా పెరుగుతున్నప్పుడు ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నించారు. “కేసీఆర్ పాలనలో సంక్షేమం కనిపించింది.. రేవంత్ పాలనలో సంక్షోభం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజలు వెయ్యి రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు” అని అంజయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా షాద్‌నగర్ పట్టణంలో వెయ్యి అడుగుల పొడవైన భారీ నిరసన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు, వాహనదారులకు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు–బకాయిలను వివరిస్తూ “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, నరేందర్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, మాజీ స్త్రీ, శిశు సంక్షేమ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి తదితరులతో పాటు మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ గ్రంథాలయ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ వైస్ ఎంపీపీలు, బీఆర్ఎస్ మండల, గ్రామ, మున్సిపాలిటీ, వార్డు అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ యువత, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: