బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

విద్యార్థులకు మద్దతు ప్రకటిస్తే పోలీసు కేసులా  జిల్లేడు చౌదరి గూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు

Home.

విద్యార్థులకు మద్దతు ప్రకటిస్తే పోలీసు కేసులా జిల్లేడు చౌదరి గూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు

విద్యార్థులకు మద్దతు ప్రకటిస్తే పోలీసు కేసులా   జిల్లేడు చౌదరి గూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు   నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ వ్2

మూడో వార్డులో పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను
మహబూబ్ నగర్ జిల్లా
నారాయణపేట జిల్లా ఉట్కూర్ ,

విద్యార్థులకు మద్దతు ప్రకటిస్తే పోలీసు కేసులా

 

జిల్లేడు చౌదరి గూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు

 

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ వ్25:పాలిటెక్నిక్ విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల షాద్‌నగర్‌లోని లింగారెడ్డిగూడలో చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి బీజేపీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల సమస్యను అర్థం చేసుకుని, వారి భవిష్యత్తుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొని, ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అయితే విద్యార్థులకు సంఘీభావం ప్రకటించినందుకు బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం?విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే కేసులా?విద్యార్థులకు మద్దతుగా నిలిస్తే కేసులా?ప్రజాస్వామ్యంలో ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు. పోలీసు కేసులతో ప్రశ్నించే గొంతును,అణచివేయలేరు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవో నంబర్ 97ను రద్దు చేయాలని జిల్లేడు చౌదరి గూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: